రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ రోబోట్ అతడిపైకి తిరిగి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఈ ఘటనను హాలీవుడ్ చిత్రం ‘ది టెర్మినేటర్’లోని సన్నివేశాలతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. రోబోట్ ఇలా రివర్స్ ఎటాక్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.