విద్యుత్ స్తంభాలపై కేబుళ్లను క్రమబద్ధీకరించాలి
NEWS Sep 03,2026 10:23 pm
కరీంనగర్ టౌన్ డివిజన్ పరిధిలో విద్యుత్ స్తంభాలపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్ వైర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని డివిజనల్ ఇంజినీర్ (DE) ఆదేశించారు. గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో రోడ్డు క్రాసింగ్లు, జిగ్‌జాగ్ కేబుళ్లను తొలగించి, గుర్తింపు ట్యాగులు ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి తనిఖీలకు సర్వీస్ ప్రొవైడర్లు సహకరించాలని, నిబంధనలు పాటించని కేబుళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.