హెల్త్ కార్డులతో న్యాయవాదులకు ప్రయోజనాలు
NEWS Sep 03,2026 09:24 pm
తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ రెన్యువల్ చేసిన హెల్త్ కార్డులు న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి అన్నారు. న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. హెల్త్ కార్డులు లేని న్యాయవాదులకు కూడా భవిష్యత్‌లో కార్డులు అందేలా కృషి చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.