విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
NEWS Sep 03,2026 09:16 pm
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహార అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ధర్మసాగర్ మండలం కాశగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.