అంతర్జాతీయ పోటీలకు గురుకుల విద్యార్థిని
NEWS Sep 03,2026 09:15 pm
హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని జి.విద్య అంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ క్రీడల్లో 63 కిలోల విభాగంలో తన ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్ 17న రాయిపూర్ లో జరగనున్న అండర్ 18 అంతర్జాతీయ ఎంపిక పోటీలలో పాల్గొననున్నారు. ఆమెను కోచ్ నాగరాజు, ప్రిన్సిపాల్ జయశ్రీతో పాటు పలువురు అభినందించారు.