మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
NEWS Sep 03,2026 09:11 pm
రాయికల్: మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం అర్హత, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తెలిపారు. వ్యక్తిగతంగా దరఖాస్తు సమర్పించలేని వారు పూర్తి వివరాలతో పాటు ధ్రువపత్రాలను ఒకే PDFగా 94415 57353, 81251 99449 వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉందని, అర్హులైన ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.