ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి
NEWS Sep 03,2026 09:14 pm
కథలాపూర్: మంచి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డా.సిందుజ సూచించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని తక్కళ్లపల్లిలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.