రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా గంభీర్ పూర్ వాసి
NEWS Sep 03,2026 07:35 pm
కథలాపూర్: మండలంలోని గంభీర్‌పూర్‌కు చెందిన విజయ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తండ్రియాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పేరు గురువారం వెలువడిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కించుకుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు బోధనలో చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. విజయ్ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.