FPO కాన్క్లేవ్‌లో రాయికల్ PACS ప్రతినిధులు
NEWS Sep 03,2026 01:04 pm
రాయికల్ : రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఎఫ్‌పీఓ కాన్క్లేవ్‌లో రాయికల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పీఏసీఎస్ సీఈఓ ఎలిగేటి రవికుమార్, చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి సమావేశానికి హాజరయ్యారు. పంటల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలపై సమావేశంలో చర్చించారు.