శ్రీని హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ DM&HO.. ఆదేశాలు ఇవే!
NEWS Sep 03,2026 04:18 pm
డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైతే వెంటనే జిల్లా సర్వేలెన్స్ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని డిప్యూటీ DM&HO డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సూచించారు. జగిత్యాలలోని 'శ్రీని హాస్పిటల్'ను పరిశీలించిన ఆయన.. సీజనల్ వ్యాధులపై యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధితులకు నాణ్యమైన వైద్యమందిస్తూనే, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖకు తెలియజేస్తే వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.