చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
NEWS Sep 03,2026 04:20 pm
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆశా కార్యకర్తలకు పోషకాహారం, నేత్రదానం, టీబీ, వ్యాధి నిరోధక టీకాలు, సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టీబీ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. ప్రతి చిన్నారికి టీకాలు సమయానికి వేయించాలని డాక్టర్ ప్రతాప్ సూచించారు. “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు కోరారు.