మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి
NEWS Sep 03,2026 02:59 pm
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్ సిఫార్సు చేశారు. ఈ మేరకు లేఖను గవర్నర్‌కు సీఎం పంపారు. తక్షణమే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం కోరారు. సీఎం లేఖపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.