పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
NEWS Sep 03,2026 02:27 pm
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిశారు. విద్యార్థులు ఎస్బీటీఈటీని స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.