యువకుడు అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు
NEWS Sep 03,2026 06:15 am
మల్యాల: ముత్యంపేట (కొండగట్టు) కు చెందిన బత్తిని లక్ష్మి తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కొడుకు బత్తిని మధు (26) మంగళవారం ఉదయం కరీంనగర్ లో అనారోగ్యంతో ఉన్న తన బావను చూడటానికి వెళ్లి తిరిగి రాలేదని, రాత్రి వరకు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిసినవారు మల్యాల పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు.