గ్రామీణ యువతకు ఐటీఐ, ఏటీసీ శిక్షణ అవకాశాలు
NEWS Sep 03,2026 11:49 am
భద్రాచలం మండలంలో గ్రామీణ యువతకు ఐటీఐ, ఏటీసీ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కృష్ణసాగర్ ఆర్‌ఐటీఐలో బుధవారం ఏటీసీ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరించారు. ఆర్టిసాన్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్, సిఎన్‌సీ మ్యాచింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.