ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
NEWS Sep 02,2026 11:29 pm
నిర్మల్: వాల్మీకి నగర్ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేశారు. జనసేన నిర్మల్ పట్టణ అధ్యక్షుడు రేగుంట వంశీ మాట్లాడుతూ పవన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిన్నారులు, అభిమానులు, కాలనీవాసులు పాల్గొన్నారు.