సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
NEWS Sep 02,2026 11:29 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ వివరాల నమోదులో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా రీ-సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.