అధికారులతో ఐటీడీఏ పీఓ రాహుల్ సమీక్ష
NEWS Sep 02,2026 11:23 pm
మణుగూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఐటీడీఏ పీఓ రాహుల్ నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా సమస్యలు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, పనులను వేగవంతం చేసి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.