కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి
NEWS Sep 02,2026 11:22 pm
తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌చార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, ఉప్పలావాయి సంధ్య, తుక్కోజీవాడి రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.