జనసేన ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
NEWS Sep 02,2026 02:57 pm
పిఠాపురం: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు.