కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ భారీ నిరసన
NEWS Sep 02,2026 02:58 pm
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో కార్యకర్తలు 420 హామీల ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించి, బాటసారులకు 'బాకీ కార్డులు' అందజేసి నిరసన తెలిపారు.