బాలికల కెరీర్ సన్నద్ధతపై అవగాహన
NEWS Sep 01,2026 10:36 pm
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సరైన కెరీర్ ఎంపిక, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను వివరించారు.