బొమ్మకల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
NEWS Sep 02,2026 10:51 pm
కరీంనగర్ 5వ డివిజన్ బొమ్మకల్ రోడ్ నంబర్ 2లో ₹10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి కార్పొరేటర్ గాదే రూప శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పనులను నిర్ణీత వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.