మహిళా సిబ్బంది భద్రతపై రాజీపడొద్దు:
డాక్టర్ సాయికృష్ణ ప్రియ
NEWS Sep 02,2026 11:18 pm
కరీంనగర్: మహిళలు, హెల్త్‌కేర్ సిబ్బందిపై దాడులను నిరసిస్తూ డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో గీతాభవన్ సర్కిల్ వద్ద శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. సిరిష హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో రాత్రి వేళల్లో తగిన సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో శాశ్వత భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.