సర్వే: ఏపీలో కూటమిదే హవా!
NEWS Sep 01,2026 10:31 pm
ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. 25 స్థానాల్లో అధికార టీడీపీ కూటమి 20 స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. కూటమి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ వీటిలో బీజేపీ 3 నుంచి 1 స్థానానికి పడిపోనుందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన తమ సంఖ్యా బలాన్ని 18 నుంచి 19 సీట్లకు పెంచుకుంటాయని తెలిపింది.