మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
NEWS Sep 01,2026 10:35 pm
కరీంనగర్: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు, 30వ డివిజన్‌లో ₹10 లక్షలతో పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోట్ల శ్యామల, కళ్లేపల్లి శారద, అధికారులు పాల్గొన్నారు.