ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
NEWS Sep 01,2026 08:36 pm
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను ఏబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు కలిశారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాల యాజమాన్యులు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం సమర్పించారు.