న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో బ్యాటర్ సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్.. వేగంతో దూసుకొచ్చి సిక్సర్‌గా వెళ్లే ఆ బంతికి చేయి అడ్డుపెట్టాడు. అద్భుత రీతిలో క్యాచ్ పట్టాడు.