నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
NEWS Sep 01,2026 10:33 pm
ఎల్.ఎండి. కాలనీ: నేరాల కట్టడికి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా చర్యలు చేపట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్.ఎండి పోలీస్ స్టేషన్‌ను ఆయన వార్షిక తనిఖీ చేశారు. రికార్డులు, లాకప్‌లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందిస్తూ, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రమేష్ పాల్గొన్నారు.