ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
NEWS Sep 01,2026 02:32 pm
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణాధికారిణి నీలిమ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. బస్టాండ్ నుంచి ఎక్కే ప్రాంతం వరకు దూరానికి అనుగుణంగా అదనపు రుసుము చెల్లించాలి. బస్సు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు 73828 25450, 99592 25450 నంబర్లకు సంప్రదించాలి.