కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన హోరు:
సెప్టెంబరు 2 నుంచి వారోత్సవాలు
NEWS Sep 01,2026 02:05 pm
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ల నాయకత్వంలో 420 అడుగుల ఫ్లెక్సీల ప్రదర్శన, కలెక్టరేట్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.