మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
NEWS Sep 01,2026 01:11 pm
కరీంనగర్: నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న సదరు వ్యక్తి నుంచి రక్షణ కల్పించి, అధికారుల వెంటనే స్పందించి అతడిని పునరావాస కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.