కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.