రేవంత్ సర్కార్ 1000 రోజుల పాలన పూర్తి
NEWS Sep 01,2026 12:00 am
రేవంత్ సర్కార్ ఏర్పడి నేటికి 1000 రోజులు పూర్తి అయ్యాయి. తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో తమ సర్కార్ 1000 రోజుల పాలన కొత్త అధ్యాయాన్ని నమోదు చేసిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు వ్యవసాయం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, సామాజిక న్యాయం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ఈ కాలంలో ప్రధానంగా దృష్టిసారించినట్లు రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రకటించింది.