దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ కు ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. సందీప్ వంగా చిత్రాలకు భిన్నంగా ఆహ్లాదకరమైన వినోదంతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డేటింగ్ యాప్ నేపథ్యంలో సాగే కథలో హీరో ప్రేమ, స్నేహితుల గ్యాంగ్‌తో జరిగే సంఘటనలు కామెడీని పంచనున్నాయి. “రాస్తే రామాయణం.. తీస్తే రోమాంచకం” డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.