చాక్‌పీస్‌తో రాఘవేంద్రస్వామి చిత్రం..
సూక్ష్మ కళాకారిణి ముకుంద ప్రియ ప్రతిభ!
NEWS Sep 01,2026 12:01 am
మంత్రాలయంలో సూక్ష్మ కళాకారిణి ముకుంద ప్రియ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వడ్డే సుజిత, మల్లికార్జున దంపతుల కుమార్తె ముకుంద ప్రియ.. శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్న చాక్‌పీస్‌పై రాఘవేంద్రస్వామి చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించి తన కళా నైపుణ్యాన్ని చాటుకుంది. విద్యార్థినిలోని ప్రతిభను పలువురు అభినందించారు.