తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారిగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటప్పుడు కులం,మతం పార్టీ ఏమీ అడగమని మంత్రి స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో ఓట్లు అడగబోమని తేల్చి చెప్పారు.