రిసర్వేలో తప్పులు లేకుండా నమోదు చేయాలి
NEWS Sep 01,2026 12:02 am
భూముల రీసర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో భూములు కొలతల శాఖ కార్యాలయంలోని 70గ్రామాలలో చేపట్టిన రిసర్వే వివరాలను సాఫ్ట్వేర్ లో నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. భూముల రీసర్వేను 5 దశల్లో చేపట్టిన వివరాలను భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్ కలెక్టర్ కు వివరించారు. భూముల రీసర్వే సమగ్ర వివరాలను ఎలాంటి లోట్లు పాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.