TG: పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
NEWS Aug 31,2026 07:33 pm
HYD: చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 9 నుంచి 5 కేటగిరిల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.