శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
NEWS Aug 31,2026 07:34 pm
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మంత్రి కొండా సురేఖ ఫోటో, శిలాఫలకాలపై ఆమె పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామంపై రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతుంది.