బడి, గుడి నిధులు భర్తీ చేయాలి: వాసుదేవరెడ్డి
NEWS Sep 01,2026 12:03 am
కరీంనగర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. బడులు, ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.