గంజాయికి మించిన మత్తు
బొమ్మకల్‌లో హాష్ ఆయిల్ పట్టివేత
NEWS Sep 01,2026 12:04 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి కంటే ప్రమాదకరమైన హాష్ ఆయిల్ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మెదడు, నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ మత్తు పదార్థంతో బొమ్మకల్‌లో తొమ్మిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ-ఒడిశా సరిహద్దుల నుంచి ఇక్కడికి రవాణా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు, విక్రేతలతో పాటు కొనుగోలుదారులపైనా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.