హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
NEWS Sep 01,2026 12:04 am
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది దళితులను అవమానించడమేనని జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మండిపడ్డారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.