ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా ప్రధాని 2 రోజుల పాటు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.