కిమ్స్ ఆస్పత్రి సేవలు అభినందనీయం
NEWS Aug 30,2026 11:13 pm
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు గ్రామంలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిబిరంలో పాల్గొని అందుబాటులో ఉంచిన అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరికరాలను వైద్య బృందంతో కలిసి నిషితంగా పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య సేవలను కేవలం ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా నియోజకవర్గం అంతట విస్తరించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.