కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
NEWS Aug 30,2026 04:25 pm
కరీంనగర్ 58వ డివిజన్ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పరిశీలించారు. వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.