తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
NEWS Aug 30,2026 04:24 pm
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆర్ అండ్ బీ వద్ద నిధులు లేకపోవడంతో ప్రజల కష్టాలను గుర్తించి మున్సిపల్ నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో సేతుబంధన్ కింద ₹150 కోట్లతో ఆర్‌ఓబీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ తారు రోడ్డుతో వాహనదారులకు రాకపోకలు సులభతరమవుతాయని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.