ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
NEWS Aug 30,2026 04:24 pm
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సాదినేని లావణ్య, బారీ జితేందర్, మున్సిపల్ అధికారులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.