అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
NEWS Aug 29,2026 11:50 pm
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కార్యదర్శి సూచించారు. 2వ తేదీలోగా వాటిని అందించాలని తెలిపారు. రూల్ 39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా రావాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే కోరారు.