RIO నోటీసులను బేఖాతరు చేస్తే సహించం
NEWS Aug 29,2026 11:35 pm
ఎమ్మిగనూరులోని దీక్ష జూనియర్ కాలేజీ యాజమాన్యంపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థికి ఒరిజినల్ టీసీ ఇవ్వకుండా ఫీజులు, పుస్తకాల ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ RIOకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ అయినా యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.